శ్రీ విష్ణు హీరోగా రెండేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది సామజవరగమన.ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా దాదాపు 30 కోట్ల వసూళ్లను సాధించింది.అయితే ఈసినిమాను చేసే ఛాన్స్ ముందుగా యంగ్ హీరో సందీప్ కిషన్ కు వచ్చింది.కానీ అదే టైం లో మైఖేల్ అనే సినిమా చేస్తుండడంతో ఈసినిమాను వదులుకోవాల్సి వచ్చిందని సందీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.అయితే మైఖేల్ నిరాశపరిచింది.అదే సామజవరాగమన చేసి ఉంటే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టేవాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు సామజవరాగమన నిర్మాతలతోనే మజాకా చేశాడు సందీప్ కిషన్. రేపు ఈసినిమా రిలీజ్ కానుంది.ఈ రాత్రి ప్రీమియర్లు పడనున్నాయి.ఈ సినిమా పై సందీప్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఇది కూడా వినోదాత్మకంగా సాగే ఫ్యామిలీ డ్రామా.ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈసినిమాను తెరకెక్కించగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది.రావు రమేష్ , అన్షు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.
ఇక సందీప్ ప్రస్తుతం తమిళం లో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.అలాగే అమెజాన్ ప్రైమ్ ,నెట్ ఫ్లిక్స్ లు నిర్మాణం లో రెండు వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. మజాకా తరువాత ఇప్పటికీ అయితే మరో తెలుగు సినిమాను ఒప్పుకోలేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























