పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘మన్మధుడు’ ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
బచ్చలమల్లి తర్వాత మీ నుంచి వస్తున్న ‘మజాకా’పై మీ అంచనాలు ఏమిటి?
- ఒక డిఫరెంట్ సినిమా చేయాలని బచ్చలమల్లి చేశాను.
- మజాకా మంచి ఎంటర్టైనర్, ఫ్యామిలీ సినిమా.
- డైరెక్టర్ త్రినాధ్ రావు, రైటర్ ప్రసన్న గారి స్టయిల్లో వుండే మాస్ ఎంటర్టైనర్.
- ఇకపై కూడా మంచి ఎంటర్టైన్మెంట్ వున్న సినిమాలనే చేస్తాను.
మజాకా పాటలు ట్రైలర్ పెద్ద గ్యాప్ లేకుండా రిలీజ్ చేశారు కదా.. దీని వలన రీచ్‌కి ఏమైనా ఇబ్బంది ఉందా?
- టీజర్ ముందే రిలీజ్ చేశాం. అది జనాల్లో వుంది.
- ట్రైలర్‌కి కంటే ముందు ‘సొమ్మసిల్లి’ పాట రిలీజ్ చేశాం, అది టాప్ ట్రెండింగ్‌లో వుంది.
- మాకు రిలీజ్ డేట్ ముఖ్యం. దాని కోసం అందరం కష్టపడి పని చేశాం.
లైవ్ షూటింగ్ ఇవ్వాలనే ఐడియా ఎవరిది?
- అనిల్ గారిది. రిలీజ్ డేట్‌కి తక్కువ టైం వుంది.
- ఏదైనా కొత్తగా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు అనిల్ గారు ఆ ఆలోచన చెప్పారు.
- దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మజాకా పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారా?
- ప్లానింగ్‌లో వున్నాం.
- ముందురోజు పెయిడ్ ప్రిమియర్ వేయాలని ప్లాన్ చేస్తున్నాం.
ఆల్రెడీ సినిమా చూసుంటారు కదా.. ఎలా అనిపిస్తోంది?
- ఖచ్చితంగా చాలా మంచి సినిమా అవుతుంది.
- మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్ వున్న సినిమా.
- ఇంటర్వెల్‌కి మంచి ట్విస్ట్ వుంటుంది.
- అది సెకండ్ హాఫ్‌ని ఎలా లీడ్ చేస్తోందో చాలా ఇంట్రస్టింగ్‌గా వుంటుంది.
- సందీప్-రావు రమేష్ సీన్స్, సందీప్-రీతు లవ్ స్టొరీ, అలాగే రావు రమేష్-అన్షు ట్రాక్ కూడా చాలా బావుంటుంది.
- సందీప్‌కి ‘భైరవ కోన..’ కంటే బెటర్ సినిమా అవుతుంది.
ఈ సినిమా బిజినెస్ విషయంలో హ్యాపీగా వున్నారా?
- చాలా హ్యాపీ. ఈ సినిమాని ప్రాఫిట్స్‌లో రిలీజ్ చేస్తున్నాను.
- సందీప్ కిషన్ గారి కెరీర్లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్.
రావు రమేష్ గారి ఛాయిస్ ఎవరిది?
- డైరెక్టర్ గారు ఫాదర్ రోల్‌కి ముందు నుంచి రావు రమేష్ గారిని అనుకున్నారు.
- ఆయన పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది.
- ఇందులో కామెడీ చాలా ఫ్రెష్‌గా వుంటుంది.
టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?
- మంచి ఎంటర్టైన్మెంట్ వున్న టైటిల్ పెట్టాలని అనుకున్నాం.
- ఒక సెలబ్రేషన్ వైబ్ వున్న సినిమా ఇది. మజాకా టైటిల్ పర్ఫెక్ట్ అనిపించింది.
త్రినాథ్ రావు నక్కిన గారితో వర్క్ చేయడం గురించి?
- ఆయనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్.
- సినిమాని అద్భుతంగా తీశారు. ఆయనతో మరో సినిమా చేయాలని వుంది.
- ఇదే సినిమాకి సీక్వెల్ చేయాలని ఆలోచన వుంది.
- సినిమా ఎండ్‌లో ‘డబుల్ మజాకా’ అనే టైటిల్ కూడా వేశాం.
మజాకాలో మెసేజ్ ఉందా?
- ఇందులో ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి మెసేజ్ కూడా వుంది.
- ఇద్దరు బ్యాచిలర్స్ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలని తపన పడతారు.
- అది సినిమాలో బ్యూటీఫుల్ ఎమోషన్.
మజాకా సినిమాని ఆల్రెడీ చూసిన వారి రెస్పాన్స్ ఏమిటి?
- నా ఫ్రెండ్స్, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కి సినిమా చూపించాం.
- ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ చాలా బావుందని చెప్పారు. పాటలు చాలా ఎంజాయ్ చేశారు.
- నేను ఏదైతే నమ్మానో అది వర్క్ అవుట్ అయ్యింది.
సామజవరగమన సీక్వెల్ ఎప్పుడు?
- మా రైటర్ భాను రవితేజ గారితో సినిమా చేస్తున్నారు.
- అది కంప్లీట్ అయ్యాక కథ రెడీ చేయాలి.
అనిల్ గారితో మీ కొలాబరేషన్ ఎలా వుంది?
- నెక్స్ట్ ఇయర్ ఓ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం.
- ఈ ఇయర్ లోనే అనౌన్స్ మెంట్ వుంటుంది.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
- సంయుక్తతో ఓ ప్రాజెక్ట్ జరుగుతోంది.
- అలాగే కిరణ్ అబ్బవరంతో సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























