గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి రెండు రోజుల క్రితం వచ్చిన మూడో పాట నానా హైరానా మ్యూజిక్ యాప్స్ ను ఓ ఊపు ఊపేస్తుంది.ఇక ఈసాంగ్ అటు యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ ను రాబట్టుకుంటుంది.తెలుగు తోపాటు తమిళ ,హిందీ భాషల్లో ఈసాంగ్ రిలీజ్ అవ్వగా తెలుగులో ఇప్పటివరకు 28మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.24గంటల్లో అయితే 23.44 మిలియన్ల వ్యూస్ తో టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ పొందిన లిరికల్ వీడియో గా సెకండ్ ప్లేస్ ను దక్కించుకుంది.27.19మిలియన్ల వ్యూస్ తో సౌత్ లోనే టాప్ లో కొనసాగుతుంది అల్లు అర్జున్ పుష్ప 2 కిస్సిక్ సాంగ్.ఈ లిస్ట్ లో నాలుగో స్థానం లో వుంది నానా హైరైనా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెలోడీ సాంగ్ పరంగా చూస్తే 24గంటల్లో నానా హైరానా అత్యధిక వ్యూస్ ను రాబట్టుకుంది.ఇక ఈసినిమా నుండి వచ్చిన మొదటి రెండు పాటలకు మించిన రెస్పాన్స్ ను రాబట్టుకుంది మూడో పాట. ఇంకో సాంగ్ రిలీజ్ కావాల్సివుంది.కార్తీక్ , శ్రేయ ఘోషల్ వోకల్స్ తోడు తమన్ సూపర్ ట్యూన్స్ నానా హైరానా ను చార్ట్ బాస్టర్ చేశాయి.ఈ సాంగ్ పిక్చరైజేషన్ కూడా అదిరిపోనుంది.
శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ నటిస్తుండగా శ్రీకాంత్, ఎస్ జె సూర్య , కిక్ శ్యామ్ ,అంజలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.జనవరి 10న గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ ను కూడా భారీగా చేయనునున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























