మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ మట్కా వాసు అనే డాన్ పాత్రలో కనిపించారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి గ్రాండ్‌గా నిర్మించారు. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీగా తెరకెక్కిన మట్కా భారీ అంచనాల నడుమ నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే బాక్సాఫీస్ వద్ద ఈ పీరియాడికల్ డ్రామా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 5నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. సో మూవీ లవర్స్, థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను వీక్షించే అవకాశాన్ని పొందండి.
కాగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా.. ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కథ:
కథానాయకుడు వాసు (వరుణ్ తేజ్) ఓ శరణార్థి. చిన్నప్పుడే బర్మా నుంచి వచ్చి విశాఖలో స్థిరపడతాడు. శరణార్థుల శిబిరంలో ప్రసాద్ (సత్యం రాజేష్) పరిచయం అవుతాడు. అయితే ఓసారి అక్కడ జరిగిన ఓ ఘర్షణ కారణంగా వాసు జైలుకు వెళతాడు. శిక్ష పూర్తై బయటకు వచ్చిన తర్వాత పూర్ణ మార్కెట్టులో కొబ్బరికాయల కొట్టు నడిపే అప్పల్ రెడ్డి (అజయ్ ఘోష్) వద్ద పనికి చేరతాడు.
ఈ క్రమంలో అతను మట్కా కింగ్‌గా మారతాడు. అయితే సాధారణ పనివాడిగా ఉండే వాసు, మట్కా కింగ్ ఎలా అయ్యాడు? సుజాత (మీనాక్షి చౌదరి)తో అతని ప్రేమ కథ ఏంటి? వాసు జీవితంలో ఎంపీ నాని బాబు (కన్నడ కిశోర్), సోఫియా (నోరా ఫతేహి) పాత్రలు ఏమిటి? అసలు వాసుని సీబీఐ ఎందుకు టార్గెట్ చేస్తుంది? సాహు (నవీన్ చంద్ర) ఎవరు? లేదా? మట్కా వాసు జీవితం చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: