పుష్ప-2 ది రూల్ ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, ఆయన క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలవబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా 12 వేలకు పైగా స్క్రీన్స్‌ల్లో విడుదల కాబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు. డిసెంబరు 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఈవెంట్ సన్సేషన్ అవుతుంది.
ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలిచింది. చెన్నయ్‌లో జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. కొచ్చిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ కూడా అక్కడ కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తాజాగా ముంబయ్‌లో ‘పుష్ప-2’ హీరో, హీరోయిన్ నిర్మాతలు సందడి చేశారు. అక్కడ గ్రాండ్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయిక రష్మిక మందన్నా మాట్లాడుతూ.. ”ఐదు సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో ఎమోషన్స్ వున్నాయి. పుష్ప ది రైజ్‌లో నాపై చిత్రీకరించిన తొలి సన్నివేశం నాకు ఇంకా గుర్తుంది. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అల్లు అర్జున్‌తో యాక్ట్ చేయడం అనగానే.. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. చాలా నెర్వస్ అయ్యాను. కానీ ఈ రోజు అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్ గా ఉన్నాను. లాట్ ఆఫ్ ఎమోషన్ష్ ఈ సినిమా చిత్రీకరణలో వున్నాయి. ఈ ఐదు సంవత్సరాల ప్రయాణం ఎంతో బాండింగ్ ఏర్పడింది” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “సుకుమార్ లాంటి జీనియస్ దర్శకుడుతో పనిచేయడం ఎంతో ప్రౌడ్‌గా ఉంది. అతను మేధస్సు మనలా సాధారణ వ్యక్తిలా ఆలోచించడు. ఆయన సెపరేట్. సెవెన్ ఇయర్స్ పుష్ప ఈజ్ మై హోమ్ లా అనిపించింది. ఇలాంటి గొప్ప టీమ్‌తో ఎన్ని సార్లు అయినా పనిచేయడానికి రెడీగా ఉంటాను. డిసెంబర్ 5న మా చిత్రం వస్తుందని గర్వంగా చెబుతున్నాను” అని అన్నారు హీరోయిన్ రష్మిక మందన్నా.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























