బచ్చల మల్లి టీజర్ రిలీజ్.. అదరగొట్టిన అల్లరి నరేష్

Allari Naresh's Bachhala Malli Teaser Released

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘బచ్చల మల్లి’. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ యూనిక్‌ కాన్సెప్ట్‌ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అల్లరి నరేష్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘మా ఊరి జాతరలో’ మరియు ‘అదే నేను.. అసలు లేను’ అనే పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. చూస్తుంటే ఇందులో విషయం ఉందనిపించేలా రూపొందించారు మేకర్స్. అల్లరి నరేష్ మరోసారి డిఫరెంట్ క్యారక్టర్‌లో రగ్గడ్‌ లుక్‌లో కనిపించారు. టీజర్ ప్రధానంగా అల్లరి నరేష్ పాత్రపై దృష్టి సారిస్తోంది. చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో నరేష్ యొక్క లుక్, ఈ మాస్ క్యారెక్టర్‌కి డెప్త్ తీసుకువస్తుంది.

అల్లరి నరేష్ అమృత అయ్యర్‌తో సరసాలాడటంతో టీజర్ ప్రారంభమవుతుంది. అతను నిర్లక్ష్యపు, మొండి పట్టుదలగల వ్యక్తిగా కనిపించాడు. ఇతరుల అభిప్రాయాల పట్ల లెక్కలేకుండా, తనకు నచ్చినట్టు జీవితాన్ని గడుపుతుంటాడు. చివరిలో చిన్న పిల్లల నుండి విరాళాల పెట్టెను తీసుకున్నప్పుడు, అతని నైజం ఏంటో చెప్పకనే చెప్పే సన్నివేశంతో టీజర్ ముగుస్తుంది. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది.

‘బచ్చల మల్లి’ చిత్రం 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామా పాయింట్‌తో తెర‌కెక్కుతోంది. ముఖ్యంగా అల్లరి నరేష్ ఫుల్ మాస్ రోల్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాలో ‘హనుమాన్’ ఫేమ్ అమృత అయ్యర్‌ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేష్, రోహిణి, సాయికుమార్‌, కోట జయరామ్‌, హరితేజ, ప్రవీణ్, ధనరాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ‘మానాడు’, ‘రంగం’, ‘మట్టి కుస్తీ’ వంటి హిట్ సినిమాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్‌గా పని చేస్తున్నారు. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్‌గా సహకారం అందిస్తున్నారు.

1990లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని ప్రాంతాన్ని గడగడ లాడించిన బచ్చల మల్లి అనే గజదొంగ జీవిత కథగా ఈ సినిమా రూపొందుతున్నట్టు సమాచారం. ఇక ఇదిలావుంటే, విడుదలకు ముందే బచ్చల మల్లి సినిమా నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ సహా ఓటీటీ, శాటిలైట్, ఆడియో.. ఇలా అన్ని హక్కులు కలిపి ఈ మూవీ మేకర్స్‌కి మంచి లాభాలను అందిస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.