పుష్ప 2 ఈవెంట్‌.. కేరళలో అల్లు అర్జున్‌కి గ్రాండ్‌ వెల్‌కమ్‌

Icon Star Allu Arjun Receives Grand Welcome in Kerala During Pushpa 2 Event

పుష్ప 2 ది రూల్‌.. ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభ, ఆయన క్లాస్‌ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలవబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు. డిసెంబరు 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి.

అంతేకాదు, ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఈవెంట్‌ సన్సేషన్‌ అవుతుంది. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్‌ లాంచ్‌ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలిచింది. చెన్నయ్‌లో జరిగిన వైల్డ్‌ ఫైర్‌ ఈవెంట్‌ గ్రాండ్‌ సక్సెస్‌గా నిలిచింది. ఐకాన్‌ స్టార్‌ ఎక్కడికి వెళితే అక్కడ ఆయన అభిమానులు గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలుకుతున్నారు.

తాజాగా ఈ చిత్రం మరో గ్రాండ్‌ ఈవెంట్‌ కేరళలోని కొచ్చిలో ఎంతో ఘనంగా జరిగింది. కేరళలో మల్లు అర్జున్‌గా అత్యధిక అభిమానులు ఉన్న తెలుగు హీరోగా పేరున్న అల్లు అర్జున్‌కు అక్కడ అశేష జనాదరణ లభించింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ అభిమానులు భారీగా హాజరవగా.. ఐకాన్‌ స్టార్‌, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొని సందడి చేసింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.