సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుమారు మూడు సంవత్సరాల తర్వాత రానున్న ఈ సీక్వెల్‌పై ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అలాగే పాటలు ఎంతో బజ్ తెప్పించాయి. ఇటీవలే పాట్నాలో టైలర్ లంచ్ చేయడం జరిగింది. సుమారు మూడు లక్షల మందికి పైగా హాజరవగా దేశంలోనే అతిపెద్ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌గా నిలిచింది.
ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్స్ దేశవ్యాప్తంగా చేయడానికి చిత్ర బృందం నిర్ణయించుకుంది. అదే సందర్భంగా ఈరోజు తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వైల్డ్ ఫైర్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. చెన్నైలోని సాయి రామ్ ఇంజనీరింగ్ కళాశాలలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం ఆవరణలో ఈ భారీ స్థాయి ఈవెంట్‌ను చేయడం జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ.. “ముందుగా నన్ను ఆహ్వానించినందుకు చాలా థాంక్స్. నాకు పుష్ప 1 భయంకరంగా నచ్చేసింది. అప్పటి నుండి పుష్పా2 ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నాను. అల్లు అర్జున్ గారి స్క్రీన్ ప్రజెంన్స్, స్టైల్ నాకు చాలా ఇష్టం. సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉంటే గానీ ఇలా చేయలేరు. దేశంలోనే ఎంతో ఎదురు చూస్తున్న సినిమాగా పుష్ప 2 వినిపిస్తుంది” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తమిళనాడులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఆల్ ది బెస్ట్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కు ఆల్ ది బెస్ట్. శ్రీలీల డ్యాన్స్ & పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తుంది” అని తెలిపారు.
ఇక ఐకాన్ స్టార్ గురించి ఇలా చెప్పారు.. “అల్లు అర్జున్ గారి బుట్ట బొమ్మ పాటలో డాన్స్ చూసి ఇంక ఎవరూ ఆయనలా ఈ పాటకు డ్యాన్స్ వేయలేరు అనిపించింది. సుకుమార్ గారి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కోసం అందరిలానే నేను కూడా ఎంతగానో వేచి చూస్తున్నాను. డిసెంబర్ 5న తేదీన కలిసి తప్పకుండా ఈ సినిమాని చూద్దాం” అని అన్నారు డైరెక్టర్ నెల్సన్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























