సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుమారు మూడు సంవత్సరాల తర్వాత రానున్న ఈ సీక్వెల్‌పై ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అలాగే పాటలు ఎంతో బజ్ తెప్పించాయి. ఇటీవలే పాట్నాలో టైలర్ లంచ్ చేయడం జరిగింది. సుమారు మూడు లక్షల మందికి పైగా హాజరవగా దేశంలోనే అతిపెద్ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌గా నిలిచింది.
ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్స్ దేశవ్యాప్తంగా చేయడానికి చిత్ర బృందం నిర్ణయించుకుంది. అదే సందర్భంగా ఈరోజు తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వైల్డ్ ఫైర్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. చెన్నైలోని సాయి రామ్ ఇంజనీరింగ్ కళాశాలలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం ఆవరణలో ఈ భారీ స్థాయి ఈవెంట్‌ను చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మీ అందరిని ఇలా చూడటం నాకు ఎంత సంతోషంగా ఉంది. పుష్ప 2 సినిమా విడుదలకు ముందే ఇంత ఆదరణ రావడం చాలా ఆనందాన్నిస్తుంది. దానికి గాను అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చిత్రంలో సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తదితర అంశాలు అన్ని చాలా బాగా వచ్చాయి. అది నాకు, నా చిన్ననాటి స్నేహితుడు అల్లు అర్జున్ కు చాలా ప్లస్‌గా నిలిచాయి” అని తెలిపారు.
అలాగే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గురించి చెబుతూ.. “ఈ చిత్ర నిర్మాతలకు నా ధన్యవాదాలు. పుష్ప నాకు మరింత స్పెషల్ సినిమా. పుష్ప 2 కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. దర్శకుడు సుకుమార్ గారికి నా ధన్యవాదాలు. ఆయన ఫైనల్ మిక్సింగ్ లో ఉన్నారు. అందుకే ఆయన రాలేకపోయారు. చిత్రం చాలా బాగా రావడం జరిగింది. కచ్చితంగా అందర్నీ మెపిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నాం” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ చిత్రం కోసం అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఎంతగానో కష్టపడ్డారు. త్వరలోనే మరొక పాట రాబోతుంది. ఆ పాటలో అల్లు అర్జున్ మాస్ డ్యాన్స్ చూడబోతున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అతిధికి పేరుపేరునా ధన్యవాదాలు. డిసెంబర్ 5వ తేదీన సినిమాను తప్పకుండా చూడండి” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: