సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుమారు మూడు సంవత్సరాల తర్వాత రానున్న ఈ సీక్వెల్‌పై ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అలాగే పాటలు ఎంతో బజ్ తెప్పించాయి. ఇటీవలే పాట్నాలో టైలర్ లంచ్ చేయడం జరిగింది. సుమారు మూడు లక్షల మందికి పైగా హాజరవగా దేశంలోనే అతిపెద్ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌గా నిలిచింది.
ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్స్ దేశవ్యాప్తంగా చేయడానికి చిత్ర బృందం నిర్ణయించుకుంది. అదే సందర్భంగా ఈరోజు తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వైల్డ్ ఫైర్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. చెన్నైలోని సాయి రామ్ ఇంజనీరింగ్ కళాశాలలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం ఆవరణలో ఈ భారీ స్థాయి ఈవెంట్‌ను చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో నటి శ్రీలీల తాను పర్ఫార్మ్ చేసిన స్పెషల్ సాంగ్ అయినటువంటి లాంచ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ.. “ఇక్కడికి వచ్చి ఇంత ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. చెన్నైలో నా పాట లాంచ్ చేయడానికి వచ్చిన నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నాకు మాటలు రావడం లేదు. నిజంగా నాకు అంత సంతోషంగా ఉంది. బన్నీ గారికి స్పెషల్ థాంక్స్. మీతో కలిసి డ్యాన్స్ చేసే ఛాన్స్ రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను” అని పేర్కొంది.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “మీతో డ్యాన్స్ చేయడం ఎలా అని అనుకున్నాను?.. కానీ మీరు చాలా సింపుల్‌గా ఉండటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. మీ నుండి నేను ఎంతో నేర్చుకున్నాను. రష్మిక గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలో తెలియడం లేదు. సెట్స్‌లో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఇప్పుడు మేము చాలా క్లోజ్ అయిపోయాము. దేవిశ్రీ ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు సుకుమార్ గారికి చాలా థాంక్స్” అని చెప్పింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































