నా జీవితం పుష్పకు ముందు, పుష్ప తర్వాత..

National Crush Rashmika Mandanna Interesting Comments on Allu Arjun and Pushpa 2

సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు మూడు సంవత్సరాల తర్వాత రానున్న ఈ సీక్వెల్‌పై ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అలాగే పాటలు ఎంతో బజ్ తెప్పించాయి. ఇటీవలే పాట్నాలో టైలర్ లంచ్ చేయడం జరిగింది. సుమారు మూడు లక్షల మందికి పైగా హాజరవగా దేశంలోనే అతిపెద్ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌గా నిలిచింది.

ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్స్ దేశవ్యాప్తంగా చేయడానికి చిత్ర బృందం నిర్ణయించుకుంది. అదే సందర్భంగా ఈరోజు తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వైల్డ్ ఫైర్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. చెన్నైలోని సాయి రామ్ ఇంజనీరింగ్ కళాశాలలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం ఆవరణలో ఈ భారీ స్థాయి ఈవెంట్‌ను చేయడం జరిగింది.

ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. “ఇంత ప్రేమను అందిస్తున్న మీ అందరికీ నా నమస్కారం. రెండే మాటల్లో నేను చెప్పాలనుకుంటున్నాను. నా జీవితం పుష్పకు ముందు, పుష్ప తర్వాత అన్నట్లుగా ఈ సినిమాతో మారిపోయింది. ఏడేళ్ల నా సినీ కెరియర్లో ఐదేళ్లు పుష్పా సినిమాతో పనిచేశాను. ఈ చిత్ర బృందం నాకు ఎంతో స్పెషల్. అల్లు అర్జున్ గారు నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా నిలిచిపోయారు. అందరూ కలిసి డిసెంబర్ 5వ తేదీన పుష్ప సినిమాని థియేటర్లో కచ్చితంగా చూడండి. నాకు మీరు, మీ అభిమానం అంటే చాలా ఇష్టం” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.