కన్నప్ప నుంచి మోహన్‌బాబు ఫస్ట్ లుక్ రివీల్

Kannappa Team Released Manchu Mohan Babu's First Look Poster

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్‌ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, బ్రహ్మానందం పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో తిన్నడికి విధేయుడైన స్నేహితుడు.. టిక్కి (గుర్రం)ని ఇటీవలే పరిచయం చేశారు హీరో విష్ణు. ఇవన్నీ మంచి హైప్ క్రియేట్ చేశాయి.

ఈ క్రమంలో తాజాగా మరో కీలక పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది కన్నప్ప టీమ్. విష్ణు తండ్రి, టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా మోహన్ బాబు క్యారెక్టర్ పోస్టర్ విడుదల చేసింది. నేటితో మోహన్‌బాబు నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా కన్నప్పలో ఆయన మహాదేవ శాస్త్రి అనే పాత్రలో కనిపించనున్నట్టు తెలిపింది.

ఈ పోస్టర్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు కన్నప్పలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కన్నప్ప నుంచి ఎలాంటి అప్డేట్లు వస్తాయో.. ఎంతలా బజ్ క్రియేట్ చేస్తాయో చూడాలి. డిసెంబర్‌లో ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.