గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ ఆయన ఈ మూవీలోని తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పూర్తి చేశారు. దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి తెలియజేశారు.
“హాయ్ ఫ్రెండ్స్, నేను గేమ్ ఛేంజర్‌లో ఒకటి మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో & మరొకటి శ్రీకాంత్ గారితో డబ్బింగ్ పూర్తి చేసాను.. ఈ 2 సీన్స్ డబ్బింగ్ పూర్తి చేయడానికి 3 రోజులు పట్టింది. “దీనమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది” లాగా ఔట్ పుట్ వచ్చింది.. థియేటర్లలో ఓ రేంజ్‌లో చప్పట్లను నేను ముందే చూడగలను. “పోతారు మొత్తం పోతారు” నాకు ఈ గొప్ప అవకాశం కల్పించిన డైరెక్టర్ శంకర్ షణ్ముగ్ సార్ మరియు దిల్ రాజు గారు & టీమ్ అందరికి ధన్యవాదాలు. త్వరలో కలుద్దాం ఫ్రెండ్స్” అని అందులో పేర్కొన్నారు.
ఇక ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్, పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: