రివ్యూ: జీబ్రా

Zebra Movie Review in Telugu

నటీనటులు : సత్య దేవ్ ,డాలీ ధనంజయ ,సునీల్ ,సత్య,ప్రియ భవాని శంకర్
ఎడిటింగ్ : అనిల్ క్రిష్
సినిమాటోగ్రఫీ : సత్య పొన్మార్
సంగీతం : రవి బస్రూర్
దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్
నిర్మాతలు : బాల సుందరం ,దినేష్ సుందరం,ఎస్ ఎన్ రెడ్డి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ లీడ్ రోల్ లో నటించిన సినిమా జీబ్రా.ప్రమోషన్స్ తో ఈసినిమా బాగానే సౌండ్ చేసింది.ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి రావడంతో జీబ్రా ప్రేక్షకులకు చేరువైంది.ఇందులో పుష్పలో జాలి రెడ్డిగా నటించిన డాలి ధనంజయ విలన్ రోల్ లో నటించాడు.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈసినిమా ఎలా వుంది? సత్యదేవ్ కు హిట్ ఇచ్చిందో లేదో తెలుసుకుందాం.

కథ :

సూర్య (సత్యదేవ్) బ్యాంకు ఉద్యోగి.డబ్బులు బాగా సంపాదించి ప్రేమించిన స్వాతిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకుంటాడు.స్వాతి కూడా బ్యాంకు ఉద్యోగే.అయితే అనుకోకుండా స్వాతి చేసిన తప్పుతో ఓ వ్యక్తి ఇచ్చిన ఓ చెక్ రాంగ్ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది.దాంతో చెక్ డిపాజిట్ చేసిన వ్యక్తి నా డబ్బులు తిరిగి ఇచ్చేయాలని పట్టుబడతాడు.ఈ క్రమంలో బ్యాంకింగ్ వ్యవస్థలోని లూప్ హోల్స్ ఉపయోగించుకొని సూర్య ఆ అమౌంట్ ను సర్దుబాటు చేస్తాడు. ఇక ఇదిలావుండగా ఓరోజు అనుకోకుండా సూర్య పేరు మీద వున్న నకిలీ అకౌంట్ లోకి 5కోట్లు వచ్చి పడతాయి. ఆ తరువాత ఆ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది.అయితే ఆ డబ్బులు తనవేనని గ్యాంగ్ స్టర్ ఆది( డాలి ధనంజయ) నాలుగు రోజుల్లో ట్రాన్స్ ఫర్ చేయాలని సూర్యకు డెడ్ లైన్ పెడతాడు. మరి ఆ తరువాత ఏమైంది ? ఇంతకీ ఆ డబ్బు నిజంగా అతనిదేనా.అసలు సూర్య పేరుతో వున్న నకిలీ అకౌంట్ ఎక్కడిది.అందులోనే ఆ డబ్బు ఎందుకు డిఫాజిట్ అయ్యింది.దాని వెనుక ఎవరున్నారు అనేది మిగితా కథ.

విశ్లేషణ :

బ్యాంకింగ్ నేపథ్యంతో తెరకెక్కింది ఈసినిమా.ఈకథను నిజానికి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పొచ్చు కానీ ఈ విషయంలో దర్శకుడు కొంచెం తడబడినట్లు కనిపించాడు కానీ చాలా వరకు ఎంగేజ్ చేశాడు.ముఖ్యంగా బ్యాంకింగ్ లూప్ హోల్స్ ను వాడుకొని మనీ కొట్టేసే సన్నివేశాలను చాలా బాగా డీల్ చేశాడు చాలా వరకు ఆ సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి.ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ఎపిసోడ్ మనీ హీస్ట్ ను గుర్తుకుతెస్తుంది.ఇందులో సత్య కామెడీతో నవ్విస్తాడు.

ఈ కథలో మనీ లాండరింగ్ ,గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లను జోడించాడు. అవి కూడా స్టోరీలో బాగానే కలిసిపోయాయి.ముఖ్యంగా హీరోకు విలన్ కుమధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.చివర్లో సినిమాను ఎమోషనల్ గా ఎండ్ చేశాడు దర్శకుడు.ఓవరాల్ గా లాజిక్ లు వెతక కుండా చూస్తే జీబ్రా డీసెంట్ అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే సత్యదేవ్ ట్యాలెంట్ ఏంటో ఇంతకుముందే చూశాం.ఇక ఈసినిమాలో సూర్య పాత్రలో తను జీవించేశాడు.చాలా సహజంగా ఆ పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయాడు.సత్య తరువాత డాలీ ధనంజయ రోల్ హైలైట్ అయ్యింది.నిజానికి సత్య కన్నా ఎక్కువ డాలీ నే స్క్రీన్ పై కనిపించాడు.ఇక ఈ పాత్రలో డాలీ ధనంజయ అదరగొట్టాడు.వీళ్లిద్దరి తరువాత కీలక పాత్రల్లో కనిపించారు సత్య ,సత్యరాజ్, సునీల్.సత్య తన కామెడీ టైమింగ్ తో నవ్వించగా సత్యరాజ్ తన అనుభవం చూపించాడు.సునీల్ పాత్ర కొత్తగా వుంది.ఇక ప్రియా భవాని శంకర్ తనకు అలవాటైన పాత్రలో కనిపించింది.

టెక్నికల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది.సంగీతం విషయానికి వస్తే ఇందులో 5 సాంగ్స్ వున్నాయి.అవి డీసెంట్ అనిపిస్తాయి.రవి బాస్రుర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపిస్తుంది.ఎడిటింగ్ ఓకే ,సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు వున్నాయ్.

ఓవరాల్ గా సత్యదేవ్ జీబ్రాలో సత్యదేవ్ నటన ,బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.లాజిక్ లు పక్కన పెట్టి చేస్తే ఈసినిమా పర్వాలేదనిపిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.