నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా తండేల్.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఇక తండేల్ నుండి నిన్న ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి రిలీజ్ చేశారు.జావేద్ అలీ గాత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ ఈ లవ్ సాంగ్ ను రిపీట్ లో వినేలా చేశాయి.శ్రీ మణి లిరిక్స్ అందించాడు.ఓవరాల్ గా ఈసాంగ్ అదిరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీకాకుళంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది.ఇందులో చైతన్య బోటు డ్రైవర్ గా కనిపించనున్నాడు. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.ఫిబ్రవరి 7 న ఈసినిమా థియేటర్లోకి రానుంది. ఈసినిమాపై అక్కినేని ఫ్యాన్స్ అయితే భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇక ఇదిలావుంటే చైతన్య నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు తో చైతన్య నెక్స్ట్ మూవీ చేయనున్నాడట. మైథికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనుండగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నాడు. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్వి సిసి, సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సివుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























