మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులే వుంది.ఈరోజు నుండి ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు.దాంతో షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది.ఈనెల 28 లోపు ఫస్ట్ కాపీని రెడీ చేయనున్నారు.మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇక ఈసినిమా నుండి స్పెషల్ సాంగ్ రిలీజ్ కానుంది.కిస్సిక్ అంటూ సాగే ఈ పాట ఈనెల 24న రాత్రి 7:02గంటలకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లు అర్జున్ ,శ్రీ లీల పై సాంగ్ చిత్రీకరించారు.వీరిద్దరి డాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ సాంగ్ లో వీరిద్దరు వేసే స్టెప్పులతో థియేటర్లు షేక్ అవ్వనున్నాయి.దేవి శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ కు సూపర్ ట్యూన్స్ ఇచ్చాడట.ఫస్ట్ పార్ట్ లో స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అందులోని స్పెషల్ సాంగ్ లో సమంత కనబడింది.ఇక ఈ సీక్వెల్ లో శ్రీ లీల చేసింది.దాంతో ఈ కిస్సిక్ సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈసినిమాను సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మిక కథానాయికగా నటించింది.మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.డిసెంబర్ 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.దాదాపు 12000కుపైగా స్క్రీన్ లలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.దాంతో భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోనుంది.హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో పుష్ప 2 1000కోట్ల మార్క్ దాటనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: