సూర్య 44 లో శ్రీయ

I have done a song in Suriya 44 says shriya

తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సూర్య 44 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సూర్య తన పాత్ర తాలూకు షూటింగ్ కూడా పూర్తి చేశాడు.ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.సూర్య లుక్ కూడా డిఫ్రెంట్ గా ఉండనుంది.ఇప్పటివరకు ఈసినిమా నుండి గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు.దీనికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుంది.ఇక స్పెషల్ సాంగ్ కోసం శ్రీయను కూడా తీసుకున్నారు.దాని తాలూకు షూటింగ్ కూడా పూర్తి చేసింది.ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని అందరికి నచ్చుతుందని శ్రీయ చెప్పుకొచ్చింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తున్న ఈసినిమాలో మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక సూర్య ప్రస్తుతం తన 45వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.ఆర్ జె బాలాజీ డైరెక్ట్ చేయనున్నాడు.వచ్చే నెల 5నుండి కోయంబత్తూరు లో మొదటి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు.ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయనున్నారు. సో 2025లో సూర్య రెండు సినిమాలతో రానున్నాడు.

ఇదిలావుంటే రీసెంట్ గా సూర్య ,కంగువాతో రాగ ఈసినిమా 200కోట్ల దిశగా పరుగులు తీస్తుంది.శివ ఈసినిమాను తెరకెక్కించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్ ,యూవీ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మించాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.