ఈ దీపావళికి కన్నడ స్టార్ శ్రీమురళి యాక్షన్ ఎంటర్‌టైనర్ బఘీరతో వచ్చాడు.ఈసినిమా తెలుగు లోకూడా రిలీజ్ అయ్యింది.స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.అయితే బఘీర ఆ అంచనాలను అందుకోలేకపోయింది.కన్నడలో మాత్రం సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి వస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈ రోజు రాత్రి 12గంటల నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.కన్నడ తో పాటు తెలుగు , మలయాళ ,తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విడుదలైన మూడు వారాల్లోనే బఘీర ఓటిటి లోకి వచ్చేస్తుంది.డాక్టర్ సూరి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్,రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.కెజియఫ్ ,సలార్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈసినిమాను నిర్మించగా బి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు.
తెలుగులో ఈసినిమాను టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి విడుదలచేసింది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అయ్యాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: