రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్.ఇప్పటివరకు ఈసినిమానుండి రెండు పాటలు రిలీజ్ కాగా రెండు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక మూడో పాట కూడా రానుంది.ఇది మెలోడీ సాంగ్ గా రానుంది.రామ్ చరణ్ ,కియారా అద్వానీ లపై ఇంతకువరకు ఎన్నడూ చూడని లొకేషన్ లలో ఈ సాంగ్ ను చిత్రీకరించారట.ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టారని సమాచారం.తమన్ కంపోజింగ్ కూడా పూర్తి చేశాడు.వచ్చే వారంలో ఈ పాట రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.సోషల్ మెసేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈనెలలో షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది.ఇందులో శ్రీకాంత్, ఎస్ జె సూర్య ,కిక్ శ్యామ్ ,అంజలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తుండగా జనవరి 10న థియేటర్లలోకి రానుంది.
ఇక రామ్ చరణ్ ఇప్పటికే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేయడం తో ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.ఈనెల 22న తన 16వ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.మైసూర్ లో ఈసినిమా కోసం ప్రత్యేకమైన సెట్ వేశారు.ఇందులో మొదటి షెడ్యూల్ జరుగనుంది.బుచ్చి బాబు సన ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది.కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: