మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం జపాన్ లో షూటింగ్ జరుపుకుంటుంది.అక్కడ చిరు, త్రిష లపై డ్యూయెట్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.మరో రెండు రోజుల్లో ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కానుంది.దాంతో షూటింగ్ దాదాపు పూర్తయినట్లే.ఆ తరువాత విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం కేటాయించనున్నారు.ఇక ఈసినిమా రిలీజ్ కూడా వాయిదాపడింది.ముందు ఈసినిమాను జనవరి 10న విడుదలచేయాలనుకున్నారు కానీ అదే రోజు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వస్తుండడంతో విశ్వంభర వెనక్కి వెళ్ళిపోయింది.అన్ని కుదిరితే సమ్మర్ బరిలో నిలువనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి సినిమా బింబిసారతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ఠ రెండో సినిమా విశ్వంభర ను కూడా ఫాంటసీ నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నాడు.ఇందులో సురభి ,ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రీయేషన్స్ నిర్మిస్తుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇక చిరంజీవి విశ్వంభర తరువాత చేయబోయే సినిమాను ఇంకా ఫైనల్ చేయలేదు.చిరు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ చేయడానికి చాలా మంది దర్శకులు క్యూ లో వున్నారు.అయితే విశ్వంభర రిలీజ్ తరువాతే చిరు తన నెక్స్ట్ మూవీ పై ఫోకస్ చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























