గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఒకవైపు ఈ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో నిష్టగా గడుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ కడప దర్గాను సందర్శించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న ఆయన సోమవారం ఈ మాల ధారణలోనే కడప దర్గాను దర్శించుకోవడం విశేషం. కాగా కడపలో 80వ దర్గా ‘నేషనల్ ముషాయిరా గజల్’ కార్యక్రమంతో పాటు ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చరణ్ కడపలో సందడి చేశారు.
అంతకుముందు కడప విమానాశ్రయం చేరుకున్న చరణ్‌కు అభిమానులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అక్కడినుండి పెద్ద దర్గా వారికి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో చరణ్‌కు దర్గా సాంప్రదాయాల ప్రకారం పీఠాధిపతి ఆరీఫ్ హుస్సేన్, ఇతర మత పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు.
ఇక ప్రతి ఏడాది జరిగే ఈ ఈవెంట్‌కు క్రితంసారి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సూచన మేరకు నిర్వాహకులు ఈ ఏడాది రామ్‌చరణ్‌ను అతిథిగా ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నప్పటికీ రెహమాన్ మాట నిలిపేందుకు చరణ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇక తన పర్యటనలో భాగంగా కడపలోని బిల్డప్ సర్కిల్‌లోని శ్రీశ్రీ విజయ దుర్గా దేవి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో చరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప పర్యటన నేపథ్యంలో మెగా పవర్ స్టార్‌ను చూసేందుకు అభిమానులు భారీగా పోటెత్తారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: