ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న తాజా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. గతంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన పుష్ప 1కు సీక్వెల్‌గా ఇది రాబోతుంది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఇటీవలే బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ చేయగా యూట్యూబ్‌లో సెన్సేషన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం 120 మిలియన్ల వ్యూస్ తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
కాగా పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్స్‌లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రీ-సేల్స్‌లో రికార్డ్ సృష్టిస్తోంది. అమెరికాలో ఇప్పటికే ప్రీ-సేల్స్ ఓపెన్ చేయగా.. బుకింగ్స్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలకు ఇంకా పక్షం రోజులకు పైగానే ఉన్నా 1మిలియన్ డాలర్స్‌కు పైగా వసూళ్లు సాధించింది.
తద్వారా అతి తక్కువ సమయంలో ఈ మార్క్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచి రికార్డ్ నెలకొల్పింది. అమెరికా వ్యాప్తంగా మొత్తం 3,230 షోలను ప్రదర్శించనున్నారు. అయితే సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలకు పైగా సమయం ఉండటంతో షోలతోపాటు ప్రీ-సేల్స్ బుకింగ్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ముందుముందు మరిన్ని రికార్డులు అందుకోవచ్చని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































