సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మానస వారణాసి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
మీ నేపథ్యం గురించి చెప్పండి?
- నేను హైదరాబాదులోనే పుట్టాను. టెన్త్ క్లాస్ వరకు మలేషియాలో చదువుకున్నాను.
- హైదరాబాదులో ఇంజనీరింగ్ చేశాను. కార్పొరేట్‌లో జాబ్ చేశాను.
- ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను. మిస్ ఇండియా టైటిల్ గెలిచాను.
- మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాని రిప్రజెంట్ చేశాను.
- తర్వాత జాబ్ చేసుకోవాలా? ఈ అవకాశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలా? అని ఆలోచిస్తున్నపుడు మూవీ వర్క్ షాప్స్‌కి వెళ్లాను.
- అక్కడ సినిమా మీద పాషన్ పుట్టింది. అక్కడే యాక్టింగ్‌పై కాన్ఫిడెన్స్ వచ్చింది.
- కొన్ని అడిషన్స్ ఇచ్చాను. సినిమా గురించి నేర్చుకుంటున్నాను. ఇది నాకు కొత్త ప్రపంచం.
- దేవకి నందన వాసుదేవ లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.
- ఇది కమర్షియల్ డివైన్ థ్రిల్లర్. ఒక డెబ్యు యాక్టర్‌గా ఈ యూనిట్‌తో పనిచేయడం చాలా అదృష్టం.
- ఈ సినిమా కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఎదురుచూస్తున్నాను.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
- నా క్యారెక్టర్ పేరు సత్యభామ. తను విజయనగరం అమ్మాయి.
- ఈ సినిమా విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది.
- సత్యభామ వెరీ ప్లే ఫుల్, లవ్ బుల్, మిస్టీరియస్ గర్ల్.
- ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంతో నిలబడే అమ్మాయి.
- ఇది పర్సనల్‌గా నాకు చాలా నచ్చిన క్యారెక్టర్.
- కథలో నా పాత్ర వెరీ స్ట్రాంగ్‌గా వుంటుంది. కథలో నాది వెరీ కీ రోల్.
ఇది మీ ఫస్ట్ సినిమా కదా.. ఎందులో మీరెదురుకున్న ఛాలెంజెస్ ఏమిటి?
- ఫస్ట్ మూవీ ఎప్పుడూ ఛాలెంజ్ గానే వుంటుంది.
- సెట్స్‌లో వాడే పదాలు, డైరెక్టర్ వాడే పదాలు, సినిమా లాంగ్వేజ్ వీటన్నిటినీ ఆన్ స్పాట్ నేర్చుకోవాలి.
- స్పాంటేనియస్‌గా ఉండాలి. అలాగే సత్య భామ పల్లెటూరి అమ్మాయి.
- ఆ బాడీ లాంగ్వెజ్, స్లాంగ్‌ని వోన్ చేసుకోవడం కూడా ఛాలెంజింగ్‌గా అనిపించింది.
- ఈ ప్రాసెస్‌ని చాలా ఎంజాయ్ చేశాను. ఇది రోలర్ కోస్టర్ లాంటి రైడ్.
- నాకు బిగ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. చాలా విషయాలు నేర్చుకున్నాను.
అశోక్ గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి?
- అశోక్ గారు వెరీ ప్రొఫెషనల్. సినిమా అంటే చాలా పాషన్.
- ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందం ఇచ్చింది.
- సెట్స్‌లో చాలా విషయాల్ని షేర్ చేసుకునేవారు.
- మహేష్ గారి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్న విషయాలు చెప్పేవారు.
- ఆయనతో వర్క్ చేయడం రియల్లీ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్.
ఈ కథలో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏమిటి?
- ఈ కథ విన్న వెంటనే నా మైండ్ బ్లో అయింది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది.
- ఒక డెబ్యు యాక్టర్‌కి ఇలాంటి కథ, క్యారెక్టర్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
- సత్యభామ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
మ్యూజిక్ గురించి?
- భీమ్స్ గారు మ్యూజిక్ ఇరగదీశారు. సినిమాని మ్యూజిక్‌తో మరో లెవల్‌కి తీసుకెళ్ళారు.
- ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. భీమ్స్ చాలా పాషనేట్ కంపోజర్.
- చాలా బ్యూటీఫుల్ నెంబర్స్ కంపోజ్ చేశారు. ఇందులో మొత్తం నాలుగు పాటలు వున్నాయి.
- ఏమయిందే, బంగారం పాటలు నా ఫేవరేట్. నేను భరతనాట్యం నేర్చుకున్నాను.
- భరతనాట్యం వలన ఆటోమేటిక్‌గా గ్రేస్ వస్తుంది.
- బంగారం మాస్ సాంగ్. విజయ్ గారు చాలా అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు.
- డ్యాన్స్ మూమెంట్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ప్రొడక్షన్ హౌస్ గురించి?
- బాలకృష్ణ గారు చాలా పాషనేట్ ప్రొడ్యూసర్. చాలా సపోర్ట్ చేశారు.
- ఆయన వలనే ఈ కథ ఇంత గ్రాండ్‌గా వచ్చింది.
- ప్రొడక్షన్ హౌస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
మీ ఫేవరేట్ జోనర్స్?
- రొమాన్స్. కామెడీ, మిస్టరీ థ్రిల్లర్ నా ఫేవరేట్ జోనర్స్.
- కథ బావుంటే ఏ జోనర్ సినిమా చేయడానికైన సిద్ధమే.
చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టమా?
- మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు.. ఇలా అందరి సినిమాలుని చూసేదాన్ని.
- గత నాలుగేళ్ళుగా ఇంకా ఎక్కువ సినిమాలు చూస్తున్నాను.
కొత్త సినిమాల గురించి?
- యువీ క్రియేషన్లో తెలుగు, తమిళ్‌లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే సినిమా చేస్తున్నాను.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































