టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
జీబ్రా కథలో ఎక్సయిటింగ్ ఎలిమెంట్స్ ఏమిటి?
- జీబ్రా కొత్త వరల్డ్. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్‌ని బ్లెండ్ చేయడం కొన్ని కథలకే కుదురుతుంది.
- జీబ్రాలో అది కుదిరింది. ఇందులో అన్ని ఎమోషన్స్ ఆర్గానిక్‌గా బ్లెండ్ అయ్యాయి.
- మాస్ ఎలిమెంట్స్, బ్యాంకింగ్ జోనర్, మనీ లాండరింగ్, కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్, యాక్షన్ ఇవన్నీ బాగా బ్లెండ్ అయ్యాయి.
- సినిమా అద్భుతంగా వచ్చింది.
- నా దగ్గర వున్న స్టొరీ ఐడియాస్ కొత్త కాన్సెప్ట్‌తో వుంటాయి. ఒక కథ చేయాలంటే ముందు నేను కన్విన్స్ అవ్వాలి.
- బ్యాంకింగ్ వరల్డ్‌లో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అవి లైమ్ లైట్‌లో పెట్టి ఆడియన్స్‌కి చూపించాలనే ఆలోచన వచ్చింది.
- బ్యాంకింగ్, మనీ లాండరింగ్ ఇలా రెండు వరల్డ్స్ బ్లెండ్ చేసి ఈ కథ రాశాను. జీబ్రా స్క్రీన్ ప్లే ఇంటెలిజెంట్‌గా వుంటుంది.
- కానీ రైటింగ్ సింపుల్ అండ్ బ్యూటీఫుల్‌గా వుంటుంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.
జీబ్రా కథ విన్న తర్వాత సత్యదేవ్ రియాక్షన్ ఏమిటి?
- జీబ్రా బౌండ్ స్క్రిప్ట్ పంపించాను. ఆయన రెండు రోజుల్లో చదివేశారు. తర్వాత ఇద్దరం కలిశాం.
- కొన్ని డౌట్స్ అడిగారు. వాటికి అన్సర్ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేద్దామని అన్నారు.
జీబ్రా టైటిల్ జస్టిఫీకేషన్ ఏమిటి?
- ఫైనాన్సియల్ క్రైమ్ చుట్టూ వుండే కథ ఇది. బ్లాండ్ అండ్ వైట్ సూచించే యానిమల్‌గా ‘జీబ్రా’ టైటిల్‌ని పెట్టడం జరిగింది.
- కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ కథ రాశాను. జీబ్రా మాస్ డ్రామా. డిజిటల్ క్రైమ్‌ని లైమ్‌లో పెట్టి సినిమా చేయడం జరిగింది.
బ్యాంక్ క్రైమ్ మీద ఎలా పట్టుసాదించారు?
- నేను ఇంజనీర్ గ్రాడియేట్‌ని. దాదాపు ముఫ్ఫై రెండు కంపెనీల్లో పని చేశాను. కానీ ఏదీ నచ్చలేదు (నవ్వుతూ).
- నా లాస్ట్ జాబ్ బ్యాంక్‌లో చేశాను. అప్పుడు అక్కడ జరిగే మిస్స్టేక్స్ గమనించాను.
- ఈ కథలో నా వ్యక్తిగత అనుభవాలు, క్యారెక్టరైజేన్స్ కూడా వున్నాయి.
- ఈ కథ ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మొదలౌతుంది.
- ఒక ఐదు వందల రూపాయిలని డిపాజట్ చేయలన్నా బ్యాంక్ ఎంతవరకూ సేఫ్టీ అనే ఆలోచన రేకెత్తించేలా వుంటుంది.
- ఇందులో బ్యాంకింగ్, గ్యాంగ్ స్టర్, మనీ లాండరింగ్ ఇలా మూడు వరల్డ్స్ వుంటాయి.
- ఈ సినిమా చూసినప్పుడు ఇలాంటి క్రైమ్ జరుగుతుందా? అనే ఆలోచన పుట్టించేలా వుంటుంది.
తెలుగు, కన్నడ, తమిళ్ ఇలా అన్ని భాషల నుంచి నటులని తీసుకోవడానికి కారణం?
- ఈ కథకు, పాత్రలకు గుడ్ పెర్ఫామర్స్ కావాలి. ఇందులో అందరికీ డిఫరెంట్ క్యారెక్టర్ రైజేషన్స్ వున్నాయి.
- సత్య, ధన ఈ క్యారెక్టర్స్‌కి పర్ఫెక్ట్ యాప్ట్. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.
- ప్రియా భావానీ శంకర్, సునీల్, సత్యరాజ్ ఈ పాత్రలనీ కథలో కీలకంగా వుంటాయి.
- వీరంతా రావడం మార్కెట్ కూడా స్ప్రెడ్ అయ్యింది.
రవి బస్రూర్ మ్యూజిక్ గురించి?
- ఇది మ్యూజికల్ క్రైమ్ స్టోరీ. ఇందులో ఏడు పాటలు ఉన్నాయి.
- కథకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. బిజిఎం కూడా అద్భుతం చేశారు.
- మూడు వరల్డ్స్‌కి మూడు డిఫరెంట్ లేయర్ మ్యూజిక్ ఉంటుంది. ఇందులో కొత్త రవి బస్రూర్‌ని చూస్తారు.
నిర్మాతల గురించి?
- చాలా పాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు.
- మూవీ త్రూ అవుట్ చాలా సపోర్ట్ చేశారు.
అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి?
- డిఫరెంట్ జానెర్స్‌లో కథలు ఉన్నాయి. తెలుగులో సినిమాలు చేయాలని ఉంది.
ఆల్ ది బెస్ట్..
- థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































