స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంలో రాశి ఖన్నా మరో కథానాయికగా నటిస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ చేస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ మహారాష్ట్రలో 24 రోజుల లాంగ్ షెడ్యూల్ ప్రారభించారు. సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి పై చిత్రీకరిస్తున్న సాంగ్‌తో ఈ షెడ్యూల్ మొదలైయింది. ఈ షెడ్యూల్ లో సాంగ్‌తో పాటు క్రూషియల్ టాకీ పార్ట్‌ని షూట్ చేయనున్నారు. లీడ్ యాక్టర్స్‌తో పాటు సినిమాలోని కీలక నటీనటులు పాల్గొంటున్నారు.
ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ హై బడ్జెట్, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ థమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. జ్ఞాన శేఖర్ బాబా డీవోపీ కాగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొఫెషనల్ నవీన్ నూలి ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























