అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ నిన్న రిలీజై యూట్యూబ్ ను రూల్ చేస్తుంది.తెలుగుతోపాటు కన్నడ ,మలయాళ, తమిళ, హిందీ,బెంగాలీ భాషల్లో రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ వ్యూస్ ను తెచ్చుకుంటుంది.తెలుగులో ఇప్పటివరకు 40మిలియన్ల కుపైగా వ్యూస్ ను రాబట్టుకొని టాలీవుడ్ లో 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన ట్రైలర్ గా పుష్ప 2 రికార్డు సృష్టించింది.ఇంతకుముందు గుంటూరు కారం 37.68 మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ఉండేది. కేవలం 14గంటల్లో పుష్ప 2 ఆ రికార్డును బ్రేక్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు తోపాటు దాదాపుగా సమానంగా వ్యూస్ ను తెచ్చుకుంటుంది హిందీ ట్రయిలర్.ఇప్పటివరకు 35మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.ఈ వ్యూస్ అలాగే నిన్న ఈవెంట్ రెస్పాన్స్ చూస్తేనే అర్ధమవుతుంది పుష్ప 2 కు నార్త్ లో ఎలాంటి క్రేజ్ ఉందో. దాంతో మొదటి రోజు రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.ఇప్పటివరకు అక్కడ షారుక్ ఖాన్ పఠాన్ 65కోట్లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో కొనసాగుతుంది.
ఇక పుష్ప 2 ట్రైలర్ అదిరిపోయింది.హిట్ టాక్ వస్తే టాలీవుడ్ నుండి మరో 1000కోట్ల సినిమా రానుంది.సుకుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రష్మిక కథానాయికగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. వచ్చే నెల 5న సోలోగా పుష్ప 2 థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























