తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా రివ్యూస్ తో సంబంధం లేకుండా సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటుంది.మూడు రోజు ఈసినిమా 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వగా నిన్న కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది దాంతో నాలుగు రోజుల్లో కంగువా ప్రపంచ వ్యాప్తంగా 160కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగా ఉండడంతో రానున్న రోజుల్లో ఇదే రన్ ను కొనసాగించాల్సి ఉంటుంది.అయితే పుష్ప 2 వచ్చే వరకు పెద్ద సినిమాలు లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు తెలుగులో కూడా కంగువా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక హిందీలో నాలుగు రోజుల్లో 8కోట్ల నెట్ ను రాబట్టుకుంది.శివ తెరకెక్కించిన ఈసినిమాలో దిశా పటాని ,బాబీ డియోల్ ,యోగిబాబు ,రెడిన్ కింగ్స్ లే కీలక పాత్రల్లో నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.స్టూడియో గ్రీన్ ,యూవీ క్రియేషన్స్ నిర్మించాయి.
ఇక ప్రస్తుతం సూర్య తన 45వ సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు.ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మించనుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు.ఈనెల చివర్లో లేదా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది
ఇదిలావుంటే కంగువా రిలీజ్ కు ముందే సూర్య తన 44 వ సినిమాను కూడా ఫినిష్ చేశాడు.కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: