బాక్సాఫీస్ వద్ద లక్కీ భాస్కర్ హవా కొనసాగుతుంది.రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చి ఏ మాత్రం స్లో అవ్వకుండా సాలిడ్ వసూళ్లను రాబడుతూ 100 కోట్లకు చేరువైంది.11 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాపంగా 96.7కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది మేకర్స్ ప్రకటించారు. ఈరోజుతో 100కోట్ల మార్క్ ను చేరుకోనుంది.ఒక్క తెలుగులోనే కాదు తమిళ, మలయాళంలో సూపర్ రన్ ను కొనసాగిస్తుంది. ఈసినిమాతో దుల్కర్ సల్మాన్ కు 100 కోట్ల క్లబ్ లో చేరనున్నాడు.అంతేకాదు లక్కీ భాస్కర్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలువనుంది.అయితే ఈవారం సూర్య కంగువా థియేటర్లలోకి వస్తుండడడం తో లక్కీ భాస్కర్ గట్టి పోటీ ఎదురుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ నిర్మించాయి.ఈసినిమా ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.వచ్చే నెల మొదటి వారంలో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ వుంది.
ఇక దుల్కర్ హీరోగా ప్రస్తుతం తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తుండగా సందీప్ గుణ్ణం ,రమ్య గుణ్ణం ఈసినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయనున్నారు.ఈసినిమా కూడా హిట్ అయితే దుల్కర్ కు హ్యాట్రిక్ అవ్వనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























