దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబరు 5న పుష్ప-2 దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్స్‌లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. పుష్ప 2 థియేట్రికల్ ట్రైలర్‌కి సంబంధించి బిగ్ అప్‌డేట్ అందించింది చిత్రబృందం. ఈనెల 17న ట్రైలర్ రానున్నట్టు తెలిపింది. ఈ మేరకు నేడు అల్లు అర్జున్ స్వయంగా ఎక్స్‌లో ప్రకటించారు. ఆరోజు సాయంత్రం 6:03కి రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్‌ను బిగ్గెస్ట్ ఈవెంట్ ఫర్ ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలింగా పాట్నాలో అత్యంత గ్రాండ్‌గా ఈ మాసివ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.
అయితే ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ఐకాన్ స్టార్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్‌ను ఇండియా వైడ్ గా ఏడు మేజర్ సిటీస్ పాట్నా, కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబయ్ హైదరాబాద్‌లలో నిర్వహించబోతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: