గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘NBK109’ (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.
అయితే ఇప్పటివరకు, నిర్మాతలు ఈ చిత్ర టైటిల్‌ను వెల్లడించలేదు. దీంతో టైటిల్‌తో పాటు, ఈ సినిమాకి సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వారి నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఎన్‌బీకే 109 టీజర్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.
ఈ మేరకు ఆయన నేడు ఎక్స్ వేదికగా.. “టీజర్ వర్క్ పూర్తయింది, అదిరిపోయేలా వచ్చింది. కంప్లీట్ మ్యాసివ్ ర్యామ్‌పేజ్‌గా భారీగా ఉంటుంది” అని తెలిపారు. దీంతో బాలయ్య అభిమానులు దీనికోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక అన్నీ కుదిరితే ‘NBK109’ టైటిల్ టీజర్‌ను ఈనెల 15న విడుదల చేయనున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్‌గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























