రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ రెండు రోజుల క్రితం విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.తెలుగు టీజర్ 24 గంటల్లో 32.40 మిలియన్ల వ్యూస్ తో టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ రాబట్టిన సెకండ్ టీజర్ గా రికార్డు సృష్టించింది.ప్రభాస్ రాధేశ్యామ్ 42.67మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానం లో వుంది.ఇక ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ అన్ని భాషల్లో కలిపి 70మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టింది.ఈటీజర్ తెలుగుతో పాటు తమిళ ,హిందీ భాషల్లో విడుదలైయింది. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ కు నేషన్ వైడ్ గా గుర్తింపు వచ్చింది దాంతో గేమ్ ఛేంజర్ టీజర్ కు మిగితా భాషల్లో కూడా ఊహించని విధంగా వ్యూస్ వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈటీజర్ అదిరిపోయింది.ఇందులో రామ్ చరణ్ కాలేజ్ స్టూడెంట్ గా ,ఐఏఎస్ గా అలాగే పంచె కట్టుతో ఏజ్డ్ గెటప్ లలో కనిపించాడు.విజువల్స్ అయితే చాలా క్వాలిటీ గా వున్నాయ్.శంకర్ మార్క్ మెసేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుంది గేమ్ చేంజర్.మరి టీజర్ కే ఇలా ఉంటే ట్రైలర్ ఎన్ని రికార్డులు సృష్టిస్తోందో.
ఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, ఎస్ జె సూర్య ,కిక్ శ్యామ్ ,అంజలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తుండగా జనవరి 10న థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా భారీగా చేయనున్నారు.త్వరలోనే ఈసినిమా నుండి మరో సాంగ్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























