వేట్టయన్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

Vettaiyan Streaming from 8th Nov On Prime video

జైలర్ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా వేట్టయన్.గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి డీసెంట్ అనిపించుకుంది.కానీ జైలర్ లో సగం కూడా రాబట్టలేకపోయింది.ఇక ఈసినిమా నెల రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి కాకముందే ఓటిటి లోకి వస్తుంది.అమెజాన్ ప్రైమ్ వేట్టయన్ ను ఈనెల 8న తమిళం తోపాటు తెలుగు ,మలయాళ ,కన్నడ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ లోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జై భీమ్ ఫేమ్ టిజె జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈసినిమాలో అమితాబ్ బచ్చన్ ,రానా, ఫహద్ ఫాజిల్ ,మంజు వారియర్ ,రితిక సింగ్ కీలక పాత్రల్లో నటించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.లైకా ప్రొడక్షన్స్ ఈసినిమాను నిర్మించింది.

ఇక ఈసినిమా తరువాత ప్రస్తుతం రజినీకాంత్ కూలీ సినిమా చేస్తున్నాడు.సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా కింగ్ నాగార్జున , ఉపేంద్ర ,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాపై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.