నాకు అది చాలా పెద్ద కాంప్లిమెంట్

Hero Yuva Chandra Krishna Thanks Audience For Big Success of Pottel

అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేసిన ఈ రెవల్యూషనరీ బ్లాక్ బస్టర్‌లో అజయ్ పవర్ ఫుల్ రోల్‌లో అదరగొట్టారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, విమర్శకులు ప్రశంసలు అందుకొని ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో యువ చంద్ర కృష్ణ మాట్లాడుతూ.. “ఈ సినిమా చూసిన అందరూ నేను కొత్త యాక్టర్ లా కాకుండా అనుభవం వున్న నటుడిగా నటించానని చెప్పారు. ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్. ఇంత మెమరబుల్ క్యారెక్టర్ ఇచ్చిన సాహిత్‌కి థాంక్ యూ. నిర్మాతలు చాలా పాషన్‌తో ఈ సినిమా చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ వుంటే ఇంకా అద్భుతమైన కంటెంట్‌ని క్రియేట్ చేయొచ్చు. ఆడియన్స్ ఎర్లీ బుకింగ్స్‌లో చూశారు. మాలాంటి అప్ కమింగ్ యాక్టర్స్‌కి అది గొప్ప ఎనర్జీ.” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “థియేటర్స్‌లో మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్డ్ అఫ్ మౌత్ చాలా స్ట్రాంగ్‌గా వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్. చాలా పాషన్ వున్న టీం ఇది. అజయ్ అన్న విక్టరీని ఆడియన్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అనన్యని అందరూ బుజ్జమ్మ అని పిలుస్తున్నారు. నోయల్ చాలా డెప్త్ వున్న క్యారెక్టర్ చేశాడు. ఆడియన్స్ సపోర్ట్ ఇంకా కావాలి. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూడండి” అని కోరారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.