అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేసిన ఈ రెవల్యూషనరీ బ్లాక్ బస్టర్‌లో అజయ్ పవర్ ఫుల్ రోల్‌లో అదరగొట్టారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, విమర్శకులు ప్రశంసలు అందుకొని ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. “సినిమాకి ప్రేక్షకులు నుంచి వస్తున్న రెస్పాన్స్ అద్భుతం. మేము ఊహించిన దాని కంటే చాలా గొప్పగా రెస్పాన్స్ వస్తుంది. ప్రీమియర్స్, ఫస్ట్ డేకి ఆడియన్స్ వచ్చి ఇంత సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. థాంక్యూ సో మచ్ ఆడియన్స్. ధియేటర్స్ 100% ఫిల్ అయ్యాయి. ఒక చిన్న సినిమాకి ఈ మధ్య కాలంలో ఇంత మంచి రెస్పాన్స్ రాలేదు” అని చెప్పారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “సాహిత్ ఒక అద్భుతమైన కథని చాలా గొప్పగా మలిచాడు. చూసినకొద్ది చూడాలనిపిస్తుంది. నా రోల్ గురించి చాలా మంది ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ బుజ్జమ్మ అని పిలుస్తుంటే చాలా ఆనందంగా వుంది. నిర్మాతలు చాలా పాషన్‌తో సినిమా చేశారు. యువ చాలా అద్భుతంగా నటించారు. అందరికీ థాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా రావాలి. మాతృదేవో భవ సినిమాకి ఎలా కనెక్ట్ అయ్యారో ఈ సినిమాకి కూడా అలానే కనెక్ట్ అవుతారు. అందరూ వచ్చి ఈ సినిమాని థియేటర్స్ లోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































