కళ్యాణ్ రామ్ NKR21 వైజాగ్ షెడ్యూల్ అప్‌డేట్

Nandamuri Kalyan Ram's NKR21 Vizag Schedule Update

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఇంకా పేరుపెట్టబడని ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. NKR21 అనే వర్కింగ్ టైటిల్​తో వ్యవహరిస్తున్న ఈ చిత్రం నిర్మాణ దశలోవుంది. ఇంతకుముందు ఈ సినిమా నుంచి ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ పేరుతో విడుదల చేసిన 33 సెకన్ల నిడివిగల స్పెషల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైజాగ్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొననున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, విజయశాంతి, శ్రీకాంత్, సాయి మంజేరకర్ మరియు యానిమల్ పృథ్వీవీరాజ్‌లతో కూడిన టాకీ పార్ట్‌ను కూడా చిత్రీకరించనుంది.

ఈ సందర్భంగా #NKR21 సెట్ నుండి మేకర్స్ ఒక వర్కింగ్ స్టిల్ విడుదల చేశారు. ప్రొడక్షన్ టీమ్ అంతా తమ పనులలో నిమగ్నమై ఉండగా, హీరో కళ్యాణ్ రామ్ శ్రద్ధగా గమనిస్తున్నారు. ఇక ఈ స్టిల్ చూస్తుంటే, షూటింగ్ నైట్ టైమ్ జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. మొత్తం 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో సినిమా మేజర్ పార్ట్ పూర్తవుతుంది.

ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ కాగా, ‘కాంతారా’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మరియు అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ బలుసు, అశోక్ ముప్పాలతో కలిసి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ వీలైనంత త్వరగా ముగించి భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మంచి భావోద్వేగాలతో పాటు యాక్షన్ మరియు ఇంటెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.