దేవర తరువాత సౌత్ నుండి వస్తున్న పెద్ద సినిమా కంగువా.ఈసినిమాపై తమిళ్ తోపాటు తెలుగు లోనూ భారీ అంచానాలు వున్నాయి.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేయనున్నారు.ఇక ఈసినిమాకు బజ్ రోజు రోజు కి పెరిగిపోతుంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్, టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రాగ నిన్న సెకండ్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ సాంగ్ అదరగొడుతుంది.రిపీట్ వాల్యూ వున్న సాంగ్ ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్. దాంతో ఈ పాట సినిమాకు మరింత హైప్ తీసుకొస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు 100కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం సాధ్యమే అయ్యేలానే వుంది.ఎందుకంటే అన్ని భాషల్లో భారీస్థాయిలో విడుదలకానుంది.పెద్దగా పోటీ కూడా ఉండకపోవచ్చు.హిట్ టాక్ వస్తే మొదటి రోజు 100కోట్ల మార్క్ దాటడం కష్టమేమి కాకపోవచ్చు.ఇప్పటివరకు కోలీవుడ్ లో లియో ,ది గోట్ మాత్రమే మొదటి రోజు ఈ మార్క్ ను దాటింది.మరి కంగువా ఈ ఫీట్ సాధిస్తుందో చూడాలి.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో శివ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా దిశా పటాని హీరోయిన్ గా ,బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కీలక పాత్రల్లో నటించారు.స్టూడియో గ్రీన్ తో కలిసి భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.సూర్య కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా కూడా ఇదే.ఇక సూర్య సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి ఐదు సంవత్సరాలు దాటింది.దాంతో ఫ్యాన్స్ కంగువా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























