కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన ‘సింగం’ సిరీస్‌కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో సూర్య పలు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘కంగువ’ నుంచి రిలీజైన మూవీ గ్లింప్స్ వీడియో, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. అలాగే అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కంగువ మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకుంది.
అయితే కంగువ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో 3డీ వర్షెన్ సహా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేశారు మేకర్స్. కాగా ‘యోలో’ అంటూ సాగే ఈ పాటకు వివేక సాహిత్యం అందించగా.. దేవి శ్రీ ప్రసాద్, లవితా లోబో ఆలపించారు. ఇక ఈ సెకండ్ సింగిల్ మూవీపై అంచనాలను మరింతగా పెంచేసేలావుంది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా సుమారు 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతుండగా.. ఓవర్సీస్ రైట్స్‌ను ‘ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సంస్థ దక్కించుకుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























