యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. పొట్టేల్ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చీఫ్ గెస్ట్‌గా హాజరవగా మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ సాహిత్ మోత్ఖూరి పొట్టేల్ విశేషాలు వివరించారు. సాహిత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “సందీప్ అన్న థాంక్యూ సో మచ్. నాకు ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు. ఏదైనా ఉంటే సందీప్ అన్నకి కాల్ చేస్తాను. తనకు ఎంతో వర్క్ ఉన్నప్పటికీ కూడా టైం తీసుకుని రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది ఇంతకుముందు మీరు ఎక్కడ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండరు. అదైతే నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను.”
“చదువుకోడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చెప్తే విన్నాము. అది ఇప్పుడు విజువల్‌గా చూడబోతున్నారు. ఆ విజువల్స్ చూసినప్పుడు కచ్చితంగా స్టన్ అవుతారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్. అజయ్ అన్న థాంక్యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. ఈ సినిమాలో అజయ్ అన్న విశ్వరూపం చూడబోతున్నారు. అంత అద్భుతంగా చేశారు. అజయ్ అన్న సీన్స్ రాగానే క్లాప్స్ కొడతారు. యువకి యాక్టింగ్ అంటే ప్యాషన్. అనన్య ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది.”
“శేఖర్ చంద్ర చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ పెంచల్ దాస్ గారి సాంగ్‌తో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. ఈ సినిమా చూసిన తర్వాత మా ప్రొడ్యూసర్స్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి నాకే భయమేసేది. ఈ సినిమాకి మంచి సపోర్ట్ చేసిన మైత్రి శశి గారికి థాంక్యూ సో మచ్. అక్టోబర్ 25న ఖచ్చితంగా థియేటర్స్‌కి వెళ్లి చూడండి. ఈ రీసెంట్ టైంలో ఏ సినిమాలో చూడని ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమాలో చూడబోతున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తీసినందుకు చాలా గర్వంగా ఉంది. అందరికీ థాంక్యూ సో మచ్” అని అన్నారు దర్శకుడు సాహిత్ మోత్ఖూరి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























