పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు గ్లోబల్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఆయన ఆ తర్వాత నుంచి ఒక్కో సినిమాతో ఇతర దేశాల్లో సైతం గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల ప్రభాస్ నటించిన ప్రతి చిత్రం ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లోనూ అదిరిపోయే వసూళ్లు దక్కించుకుండటం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదేక్రమంలో ఇప్పుడు ఆయన చిత్రాలు కొన్ని ఇండియాతోపాటు ఇతర దేశాల్లోనూ రీ రిలీజ్ కాబోతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటించిన 8 సినిమాలు గ్రాండ్ రీ రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా స్టార్ హీరోల ఒకటో, రెండో చిత్రాలు రీ రిలీజ్ కావడం సహజం.
కానీ ఏకంగా 8 సినిమాలు రీ రిలీజ్ అంటే.. మామూలు విషయం కాదు, ఒకరకంగా ఇది రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఇక ప్రభాస్ బర్త్ డే సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ అవుతోన్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.. ‘ఈశ్వర్, రెబెల్, మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విడుదలవుతుండగా.. ‘సలార్’ రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోనూ రిలీజ్ కానుంది. అలాగే ‘ఛత్రపతి’ సినిమా ప్రత్యేకంగా కర్ణాటకలో గ్రాండ్ రీ రిలీజ్ అవుతోంది.
ఇక గుజరాత్ రాష్ట్రంలో ‘మిర్చి’ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ జరుగనుంది. మరోవైపు జపాన్ దేశంలో ప్రభాస్ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ‘రాధేశ్యామ్, సాహో’ సినిమాలు అక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించబడుతున్నాయి. ఈ న్యూస్ తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరోకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























