సీనియర్ హీరో సుమంత్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మిస్టరీ డివోషనల్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’.’సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో మెప్పించిన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ డివైన్ థ్రిల్లర్‌ను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మేకర్స్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో ఒక బిగ్ స్టార్ హీరో దాదాపు 20 నిమిషాల పవర్ఫుల్ కేమియో రోల్లో కనిపించబోతున్నారని, ఆయన ఎవరనేది త్వరలోనే విడుదలయ్యే ట్రైలర్లో రివీల్ చేయనున్నట్లు తెలిపారు.
పూర్వకాలపు రహస్యాలు, మహేంద్రగిరి ప్రాంతంలో వారాహి దేవి దివ్య శక్తి చుట్టూ సాగే అంతుచిక్కని సంఘటనలు, మైథలాజికల్ అంశాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సుమంత్ సరసన మీనాక్షి గోస్వామి హీరోయిన్గా నటిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై కలిపు మధు, సురభి లక్ష్మణ్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడం,పెద్దగా పోటీ లేని సమయాన్ని చూసి సెప్టెంబర్ 11 డేట్‌ను ఫిక్స్ చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























