ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో సూపర్ హిట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ జీనియస్, సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ ‘ఖడ్గం’ చిత్రం నేడు గ్రాండ్‌గా రీ రిలీజ్ అయింది. దాదాపు 22 ఏళ్ల తరువాత మళ్లీ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఖడ్గం సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. ఉదయం నుంచే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్లకు బారులు తీరారు. ఇక రెండు దశాబ్దాల తర్వాత ఖడ్గం సినిమాను మళ్ళీ బిగ్ స్క్రీన్‌పై చూసిన ఆడియెన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి చూసిన నాటి స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు.
ఇక ఈ మూవీని తొలిసారి చూసిన మరికొంతమంది అయితే ఉద్వేగానికి లోనవుతున్నారు. ఇంత అద్భుతమైన చిత్రం తెలుగులో 22 ఏళ్ల క్రిందటే వచ్చిందన్న విషయం తెలుసుకుని వారు ఆశ్చర్యపోతున్నారు. అన్ని థియేటర్లు దేశభక్తితో ఉప్పొంగిపోతున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ సుదర్శన్ థియేటర్‌కు వచ్చి అభిమానులతో కలిసి సినిమా చూసారు.
ఈ చిత్రంలో ప్రధానంగా దేశభక్తి మెయిన్ థీమ్ అయినా.. జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలను దర్శకుడు సృజించిన తీరు అన్ని వర్గాలవారిని మెప్పిస్తుంది. ఉన్నత విలువలు పాటించడం, కష్టసాధ్యమైనా గట్టి పట్టుదలతో లక్ష్యాన్ని సాధించడం. కుల,మతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య ఉండే స్నేహం, దేశంకోసం సైనికులు చేసే త్యాగం వంటి అంశాల గురించి ఈ సినిమాలో దర్శకుడు అంతర్లీనంగా ప్రస్తావించిన వైనాన్ని ప్రేక్షకులందరూ ప్రశంసిస్తున్నారు.
ఈ సందర్భంగా ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టామని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. కార్తికేయ మూవీస్ పతాకంపై సుంకర మధుమురళి నిర్మించిన ఖడ్గం 2002 నవంబర్ 29న విడుదలై ఘనవిజయం అందుకుంది. సాధారణ ప్రేక్షకులనే కాకుండా, సినీ విమర్శకులను సైతం మెప్పించి పలు అవార్డులు కూడా గెలుచుకుంది.
దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఖడ్గం సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వీరికి జోడీగా సోనాలి బింద్రే, కిమ్ శర్మ, సంగీత, పూజా భారతి ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించారు. అలాగే ఉత్తేజ్, శివాజీ రాజా, షఫీ, ఆహుతి ప్రసాద్, ఎంఎస్ నారాయణ, పావలా శ్యామల తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా.. అన్ని పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























