టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు నటించిన ఒకప్పటి హిట్ సినిమాలను సరికొత్త సాంకేతిక హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇది ఆయా హీరోల అభిమానులకే కాకుండా మూవీ లవర్స్ అందరికి థ్రిల్ అందిస్తోంది. దీంతో ఇటు ఆడియెన్స్, అటు ప్రొడ్యూసర్స్ ఇద్దరికీ ఉపయుక్తంగా ఉంటోంది ఈ రీ రిలీజ్ ప్రక్రియ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు నటించిన ఒకప్పటి హిట్ సినిమాలను సరికొత్త సాంకేతిక హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇది ఆయా హీరోల అభిమానులకే కాకుండా మూవీ లవర్స్ అందరికి థ్రిల్ అందిస్తోంది. దీంతో ఇటు ఆడియెన్స్, అటు ప్రొడ్యూసర్స్ ఇద్దరికీ ఉపయుక్తంగా ఉంటోంది ఈ రీ రిలీజ్ ప్రక్రియ.
ఈ క్రమంలో తాజాగా మరో సూపర్ హిట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ జన్మదినం (అక్టోబర్ 23) సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాలు మళ్ళీ థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ని ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర చేసిన Mr. ఫర్‌ఫెక్ట్ సినిమా త్వరలో రీ రిలీజ్ కాబోతోంది.
ప్రజెంట్ జెనరేషన్ ఆడియెన్స్‌కు నచ్చేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో సరికొత్త హంగులతో 4Kలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాడు ఈ చిత్రాన్ని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ మళ్ళీ ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా Mr. ఫర్‌ఫెక్ట్ రీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇక హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన Mr. ఫర్‌ఫెక్ట్ అప్పుడు అన్నివర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుని సూపర్ హిట్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమా నేటి తరం ఆడియెన్స్‌ని ఎలా ఆకట్టుకుంటుందో.. అప్పటి ఆడియెన్స్‌కు ఎంతలా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తుందో చూడాలి. కాగా ప్రభాస్ జన్మదినం సందర్భంగా చాలా చిత్రాలు రీ రిలీజ్ అవుతుండటం గమనార్హం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: