కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే ‘ది గోట్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. 40 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దళపతి క్రేజ్ ఏంటో మరోసారి చాటింది. ఇప్పుడు ఆయన తన 69వ సినిమా ప్రారంభించబోతున్నాడు. రీసెంట్‌గా ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ‘ఖాకి’ ఫేమ్ హెచ్ వినోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు. ఇప్పటికే ఆయన పొలిటికల్ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. 2026 తమిళనాడు ఎలక్షన్స్ టార్గెట్‌గా విజయ్ పార్టీ బరిలోకి దిగనుంది. దీంతో ఈ 69వ సినిమాపై అంతటా భారీ అంచనాలున్నాయి. మరోవైపు విజయ్ చివరి సినిమాను ఫ్యాన్స్‌కు గుర్తిండిపోయేలా తెరక్కించాలని డైరెక్టర్ వినోత్ గట్టి పట్టుదలతో వున్నాడు.
దీనికి తగ్గట్టే ఈ మూవీలో భారీ తారాగణం భాగం కాబోతుంది. ఇప్పటికే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ అందింది. బాలీవుడ్ స్టార్ నటుడు ‘యానిమల్’ సినిమాలో క్రూరమైన విలన్‌గా కనిపించిన బాబీ డియోల్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ‘దళపతి 69’ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. తమిళంలో ఈ సంస్థకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అయితే ప్రస్తుతం కేవీఎన్ ప్రొడక్షన్స్ ‘కేజీయఫ్’ ఫేమ్ యష్ హీరోగా ‘టాక్సిక్’ అనే సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. కాగా వచ్చే ఏడాది అక్టోబర్‌లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























