కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘స్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. స్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వాగ్ సినిమా గురించి, ఇందులో మీ రాజ్యం గురించి చెప్పండి?
- స్వాగ్.. అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్‌ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని షార్ట్‌గా ‘స్వాగ్’ అని టైటిల్ పెట్టాం.
- స్వాగ్ ఒక వంశానికి సంబధించిన కథ. మాత్రు, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవంత్సవంలో మొదలయ్యే కథ.
- మగ గొప్పా? ఆడ గొప్పా? అనే అంశంపై చిన్న టిట్ ఫర్ టాట్ లాంటి కథ.
- తెలుగు ప్రేక్షకులు కొత్త కథ ఎప్పుడు చెప్పినా ఆదరించారు. అదే ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది.
- నేను ఎప్పుడూ డ్యుయల్ రోల్స్ చేయలేదు. ఇందులో నాలుగు పాత్రలు చేశాను.
- అందరూ ఒకే పోలికతో వుండే ఒకే వంశస్తులే. నాలుగు పాత్రలు వున్నప్పడు ఎలా చేయాలనేది ఛాలెంజ్‌గా అనిపించింది.
- వన్స్ గెటప్స్ అన్నీ సెట్ అయ్యాక.. చాలా బాగా కుదిరింది. సినిమా చాలా బావొచ్చింది.
- ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమా ఇది. పెద్దవాళ్ళకి సినిమా విపరీతంగా నచ్చుతుంది. అలాగే యంగ్ ఆడియన్స్‌కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో వున్నాయి.
- సినిమా చూసి పేరెంట్స్‌ని కూడా సినిమాకి తీసుకువెళ్తారు. ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఇందులో వున్నాయి.
- మన వంశం గురించి, పెద్దల గురించి, తాతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటనేది ఇందులో చాలా చక్కగా చూపించడం జరిగింది.
- చాలా పెద్ద కథ ఇది. రెండున్న గంటల్లో ఇంత పెద్ద కథ చెప్పారా అని సినిమా చూసిన తర్వాత దర్శకుడిని ప్రేక్షకులు అభినందిస్తారు.
- కథలో బాగంగానే ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుంది. అందరి ఆడియన్స్‌కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.
- నా కెరీర్‌లో ఈ సినిమా వన్ అఫ్ ది టాప్ ఫిల్మ్‌గా నిలుస్తుందనే నమ్మకం వుంది.
రాజ రాజ చోర తర్వాత మీరు, హసిత్ గోలి, పీపుల్ మీడియా కలసి సినిమా చేయాలన్నప్పుడు ఎలాంటి డిస్కర్శన్ జరిగింది?
- రాజ రాజ చేస్తున్నప్పుడు సెకండ్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాం.
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు ప్రాజెక్ట్ చేసుకోమని చెప్పారు.
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మమ్మల్ని నమ్మి ‘రాజ రాజ చోర’ సినిమా ఇచ్చింది. చాలా సపోర్ట్ చేశారు.
- ఈ సినిమా ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మంచి సక్సెస్ అవుతుంది.
స్వాగ్ టైటిల్‌లో డాగ్స్ కనిపిస్తాయి.. దాని గురించి చెప్పండి?
- స్వాగనిక వంశ రాజులు సింహాసనాలపై కూర్చుకున్నప్పుడు పక్కన డాగ్స్‌ని పెట్టుకుంటారు.
- డాగ్స్‌ని గుంపులు వేసుకొని వస్తుంటారు. అదొక సింబాలిక్‌గా టైటిల్‌లో పెట్టాం.
- ఇందులో క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ బాగా కుదిరాయి. రీతూ వర్మ క్యారెక్టర్‌లో చాలా మంచి ట్రాన్సఫర్మేషన్ వుంటుంది.
- ఈ సినిమా చూసాక ఆడవాళ్ళని ఒక మెట్టు ఎక్కువ అభిమానం, గౌరవంతో చూస్తాం.
- భవభూతి క్యారెక్టర్‌ని కూడా సినిమా పూర్తయిన తర్వాత ఆడవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు.
- ఈ సినిమా చూసినప్పుడు నటులు కాకుండా పాత్రలే గుర్తుంటాయి.
ఇందులో మీకు కష్టమైన క్యారెక్టర్ ఏమిటి?
- సింగ క్యారెక్టర్ కొంచెం ఈజీ అనిపించింది. మిగతా మూడు కష్టమైనవే. వాటి గెటప్, బాడీ లాంగ్వెజ్, డైలాగ్ డిక్షన్ దేనికవే ప్రత్యేకం.
- రోజుకి నాలుగున్న గంటల సేపు మేకప్ వేసుకోవడం, మళ్ళీ దాన్ని తీయడానికి మరో రెండు గంటల సమయం పట్టడం.. ఇదంతా చాలా టఫ్.
- అయితే రేజర్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత దానికి వచ్చిన మంచి రెస్పాన్స్ మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చిన అనుభూతి కలిగింది.
- అందరూ వందశాతం ఎఫర్ట్ పెట్టి సినిమా చేశారు. కింగ్ ఎపిసోడ్స్‌కి మోనో లాగ్స్ వున్నాయి. దాని కోసం ప్రత్యేకంగా ప్రాక్టిస్ చేశాం.
- ఇందులో 90 ఇయర్స్ క్యారెక్టర్ కూడా వుంటుంది. అది చాలా బావొచ్చింది.
స్వాగ్ లో నాలుగు తరాలని చూపించారు కదా? స్క్రీన్ ప్లే ఎలా వుంటుంది?
- ఒక కుటుంబం కథ చెప్పినప్పుడు స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమేయ్యేలా వుండాలి. ఎలాంటి కన్ఫ్యూజన్ వుండకూడదు.
- స్వాగ్ లో స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమయ్యేలా చాలా ఎంగేజింగ్‌గా వుంటుంది. సింపుల్‌గా వుంటూనే చాలా కొత్తగా వుంటుంది.
మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్ గురించి?
- మీరా జాస్మిన్ గారు చాలా అద్భుతంగా చేశారు. 90లో మదర్ లాంటి క్యారెక్టర్.
- ఆ క్యారెక్టర్‌ని చూసినప్పుడు అందరి మదర్స్ గుర్తుకు వస్తారు.
- ఆ పాత్ర చాలా హుందాగా హోమ్లీగా వుంటుంది. యునానిమస్‌గా అందరికీ నచ్చుతుంది.
వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి?
- వివేక్‌తో బ్రోచేవారెవరురా, రాజ రాజ చేశాను, ఇది మూడో సినిమా. పాటలు సిట్యువేషన్‌కి తగ్గట్టుగా వుంటాయి.
- బీజీఎం థియేటర్స్‌లో క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా తన కెరీర్‌లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది.
ప్రేక్షకులు ఏం ఆశించి సినిమాకి రావాలి?
- కొత్త కథ. ప్రతి ఇరవై నిమిషాలకు అబ్బురపరిచే ట్విస్ట్ వుంటుంది. సర్‌ప్రైజ్‌లు వుంటాయి.
- ప్యూర్ కంటెంట్ సినిమా. పండగ సినిమాల్లో తప్పకుండా ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా.
కొత్తగా చేయబోతున్న సినిమాలు?
ఒక థ్రిల్లర్ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్‌లో ఓ ఎంటర్‌టైనర్ చేస్తున్నాను.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























