మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే ఏర్పడ్డ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవర.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే మొదటిరోజు అనూహ్యంగా మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత క్రమంగా ఆడియెన్స్ మౌత్ టాక్‌తో బ్లాక్ బస్టర్ దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే 304 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇక రోజురోజుకీ కలెక్షన్స్ పెంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ క్రమంలో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ బెల్ట్ మరియు ఓవర్‌సీస్‌లో సైతం దేవర అదరగొడుతోంది. దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా ఉంది. హిందీలో ఇప్పటికే 30 కోట్లకు పైగా వసూళ్లు అందుకోవడం విశేషం. ఈ వీకెండ్ నాటికి 50 కోట్ల క్లబ్ లోకి ఎంటరవ్వొచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మొత్తానికి దేవర సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో సాలిడ్ మార్కెట్ ఏర్పరచుకోనున్నాడు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం దేవర ఆస్ట్రేలియాలో పెద్దగా ప్రమోట్ చేయకున్నా ఇప్పటివరకూ 800K డాలర్స్ పైగా వసూళ్లు సాధించింది. అలాగే నార్త్ అమెరికాలోనూ దేవర కళ్ళు చెదిరే వసూళ్లు రాబడుతోంది. 5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ అందుకుంది. ఈ ప్రాంతాల్లో ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: