గేమ్‌ ఛేంజర్‌.. శంక‌ర్‌తో థ‌మ‌న్ స్పెషల్ వీడియో

Game Changer Team Shares Special Interview Video of Thaman and Director Shankar

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. త‌మిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. క్రిస్మస్​ కానుక‌గా డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈ ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో సెకండ్ సింగిల్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ అనే లిరికల్ వీడియోను చేయ‌నున్న‌ విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోను సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలోని మ్యూజిక్‌కు సంబంధించి థ‌మ‌న్ ఒక వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో థ‌మ‌న్ ‘ది సౌండ్స్‌ ఆఫ్‌ గేమ్‌ ఛేంజర్‌’ పేరిట ఎంట్రీ సాంగ్‌ గురించి డిస్కస్ చేయడం చూడొచ్చు. ఇక ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తుంది.

కాగా గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందించగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. రామ్ చరణ్‌, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.