ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘పుష్ప’ చిత్రానికి కొనసాగింపుగా ఇది తెరకెక్కిస్తున్నారు. తొలిభాగం పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో పుష్ప 2పై ఇప్పటినుంచే భారీ అంచనాలున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనికితోడు ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇదిలావుంటే, తాజాగా పుష్ప 2 చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజ్ ఫీల్ ఎక్స్ పీరియన్స్ చేసింది. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ఇటీవల ఈ మూవీ సెట్స్‌ను సందర్శించారు.
అయితే అనుకోని విధంగా వచ్చిన ఈ అతిథిని చూసి పుష్ప 2 యూనిట్ ఆశ్చర్యానికి లోనయింది. ఇక ఈ సందర్భంగా రాజమౌళి దర్శకుడు సుకుమార్ సహా చిత్రబృందంతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో సుకుమార్ తీసిన ఓ సీన్‌ను ఆయన కళ్లారా చూసి సూపర్బ్ అని ప్రశంసించారు. అయితే గతంలో కూడా రాజమౌళి రంగస్థలం సెట్లో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పుష్ష 2 చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మరోవైపు ఇదే స్టూడియోలో మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ సందర్భంగా ‘పుష్ష 2’ సెట్ కి వెళ్లారు. ఆ సమయంలో బన్నీతో పాటుగా మిగిలిన ప్రధాన తారాగణం అంతా సెట్లోనే ఉంది. వీరితో రాజమౌళి దాదాపు అరగంట సేపు ఉన్నారని సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోను దర్శకుడు సుకుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, నెట్టింట వైరల్ అవుతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























