యంగ్ హీరో కార్తి ,సీనియర్ హీరో అరవింద స్వామి లీడ్ రోల్స్ లో నటించిన సినిమా మెయ్యళగన్.96 ఫేమ్ ప్రేమ్ కుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.రేపు విడుదల కానుంది.ఇక నిన్న చెన్నైలో స్పెషల్ ప్రీమియర్స్ వేశారు.దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.మూవీ అయితే అదిరిపోయిందని అంటున్నారు.సినిమా చూసిన వారు రివ్యూస్ ఇచ్చారు.సినిమా బ్లాక్ బాస్టర్ అని కార్తి ,అరవింద స్వామి నటన సూపర్ అని ఇది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ సినిమా అంటున్నారు.మొత్తానికి రిలీజ్ కు ముందే ఈ టాక్ రావడంతో టీం హ్యాపీ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులో సత్యం సుందరం గా ఈనెల 28 విడుదలవుతుంది.కార్తికి తెలుగులో కూడా మార్కెట్ వున్న సంగతి తెలిసిందే.దాంతో ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు.క్లీన్ యు సర్టిఫికెట్ తో రానుండగా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ తెలుగులో విడుదలచేస్తుంది.ట్రైలర్ కు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం గట్టి పోటీఎదురుకానుంది.ఎందుకంటే రేపు ఎన్టీఆర్ దేవర విడుదలకానుండగా ఒక్క రోజు గ్యాప్ తో సత్యం సుందరం వస్తుంది.దాంతో ఈసినిమాకు థియేటర్ల కొరత కూడా ఎదురుకానుంది.
సత్యం సుందరంలో శ్రీ దివ్య ,రాజ్ కిరణ్ ,కరుణాకరన్ కీలక పాత్రల్లో నటించగా గోవింద్ వసంత సంగీతం అందించాడు.2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక ,సూర్య ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























