మా నాన్న సూపర్ హీరో సెకండ్ సింగిల్ అప్‌డేట్

Sudheer Babu's Maa Nanna Superhero Second Single Update

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మా నాన్న సూపర్ హీరో’తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొన్నిరోజుల క్రితం మేకర్స్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇక ఇటీవలే నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఇటీవలే మా నాన్న సూపర్ హీరో నుంచి ఫస్ట్ సింగిల్‌ ‘నాన్నా’ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయగా హృద్యంగా ఉండి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుటోంది.

ప్రతి కొడుకు తన తండ్రికి హార్ట్ ఫుల్‌గా రాసే ప్రేమ లేఖ లాంటి అనుభవాన్ని ఇచ్చే ఈ సాంగ్‌లో కొడుకు తన తండ్రి పట్ల ఉన్న ప్రేమ, అభిమానాన్ని అందంగా ప్రజెంట్ చేసింది ఈ సాంగ్. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది. త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ‘వేడుకలో’ అనే వెడ్డింగ్ సాంగ్ ను ఈనెల 28న రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించింది.

కాగా మా నాన్న సూపర్ హీరో చిత్రానికి అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే అభిలాష్ రెడ్డి కంకర, MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల రైటర్స్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేసిన విధంగా, ఈ సినిమాను అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.