మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్ పాత్రలో కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నుండి ఇప్పటివరకూ రిలీజైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ట్రైలర్ మరియు రిలీజ్ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. మరోవైపు ప్రీ సేల్స్‌లో ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం జోరు చూపిస్తోంది. దీంతో దేవరపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరూ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించిన దేవర పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో దేవర థియేట్రికల్ రన్ టైమ్ ఎంతనేదానిపై అభిమానుల్లో క్యూరియాసిటీ ఏర్పడింది.
అయితే ఈ అంశంపై ఇంత ఉత్సుకత ఎందుకంటే.. ఈ మేమధ్య కాలంలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఎక్కువ రన్ టైమ్ కలిగి ఉంటున్నాయి. ఇటీవల వచ్చిన యానిమల్, కల్కి, సరిపోదా శనివారం వంటి చిత్రాలు 3 గంటలకు పైగా నిడివి కలిగివున్నాయి. అయితే ఒక్కోసారి ఇంత సమయం పాటు ప్రేక్షకుడు థియేటర్లో కూర్చోవాలంటే మూవీలో అందుకు తగ్గ కంటెంట్ ఉండాలి. లేదంటే, ఆడియెన్స్ అసహనానికి గురవుతారు.
ఇక దేవర థియేట్రికల్ రన్ టైమ్ విషయానికొస్తే.. మొత్తం 2 గంటల 42 నిమిషాలుగా ఉంది. కానీ, మొదట సెన్సార్ అయ్యే సమయానికి ఇది 2 గంటల 50 నిమిషాల 58 సెకన్లుగా ఉంది. అయితే మూవీ టైటిల్ క్రెడిట్స్ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా కొన్ని నిమిషాలు తేడా వచ్చిందని, అంతేతప్ప సినిమాలో ఎలాంటి సీన్స్ ట్రిమ్ చేయలేదని డైరెక్టర్ కొరటాల శివ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పష్టత ఇచ్చారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























